Header Banner

తాటిచెర్లమోటు రోడ్డు ప్రమాదం ఘటనపై చంద్రబాబు, పవన్‌, లోకేశ్ దిగ్భ్రాంతి! బాధిత కుటుంబాలకు..

  Fri May 23, 2025 21:19        Politics

ప్రకాశం జిల్లా తాటిచెర్లమోటు వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆరుగురు వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం పట్ల ఆయన తీవ్ర ఆవేదన చెందారు. మహానంది దర్శనానికి వెళ్లి వస్తూ ఇలా ప్రమాదంలో మరణించడం చాలా బాధాకరమని అన్నారు. ప్రస్తుతం ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం, ప్రమాదానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అన్ని విధాలా అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వారికి అవసరమైన సహాయం అందించాలని జిల్లా అధికారులను ఆదేశించారు. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా స్పందించారు. తాటిచెర్లమోటు రోడ్డు ప్రమాదం దిగ్భ్రాంతికరం ప్రకాశం జిల్లా తాటిచెర్లమోటు దగ్గర చోటుచేసున్న రోడ్డు ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారని తెలిసి దిగ్భ్రాంతికి లోనయ్యాను.

 

ఇది కూడా చదవండి: ప్రకాశం జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. లారీని ఢీకొన్న కారు.. ఆరుగురు దుర్మరణం!

 

స్టూవర్టుపురంనకు చెందిన మహానంది వెళ్ళొస్తున్న సందర్భంలో ఈ ప్రమాదం చోటు చేసుకున్నట్లు తెలిసింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నాను. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుంది. రాష్ట్ర ఐటీ, విద్యాశాఖల మంత్రి నారా లోకేశ్ కూడా ఈ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మహానంది దైవ దర్శనం చేసుకుని తిరిగి వస్తున్న వారు దుర్మరణం చెందడం తనను తీవ్రంగా కలచివేసిందని అన్నారు. ప్రమాద వివరాలను అధికారుల నుంచి తెలుసుకున్న మంత్రి, మృతుల కుటుంబాలకు అన్ని విధాలా సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్లు తెలిపారు. మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అనగాని సత్యప్రసాద్, డోలా శ్రీ బాల వీరాంజనేయస్వామి, రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి కూడా ఈ ప్రమాద ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్ మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. జిల్లా ఎస్పీ, ఇతర అధికారులతో మాట్లాడి, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని ఆదేశించారు.

 

ఇది కూడా చదవండి: ఏపీ ప్రజలకు అదిరిపోయే వార్త.. కొత్తగా కేబుల్ బ్రిడ్జ్! రూట్ లోనే ఫిక్స్ - నేషనల్ హైవేకు దగ్గరగా.!

అన్ని రకాల వార్తల కోసం  ఇక్కడ క్లిక్ చేయండి

మీకు ఈ న్యూస్ కూడా నచ్చవచ్చు:

ఢిల్లీ పర్యటనలో ఏపీ సీఎం.. కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషితో చంద్రబాబు భేటీ!

 

హార్వర్డ్‌కు ట్రంప్ సర్కార్ షాక్! అంతర్జాతీయ విద్యార్థుల ప్రవేశంపై నిషేధం!

 

గోల్డ్ లవర్స్ ఇక కొనేసేయండి..! బంగారం ధర తగ్గిందోచ్.. ఎంతంటే.?

 

వైసీపీ మాజీ మంత్రికి అష్టదిగ్బంధన! లుక్ అవుట్ నోటీసులు జారీ!

 

వామ్మో.. భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. దెబ్బకు మళ్లీ లక్షకు చేరువలో!

 

స్కూల్ బస్సుపై సూసైడ్ బాంబ్! నలుగురు చిన్నారులు స్పాట్.. 38 మందికి సీరియస్!

 

జగన్‌ను కోర్టుకు రప్పిస్తా! అప్పటి వరకు నిద్రపోను!

 

విజయవాడలో మరో ఇంటిగ్రేటెడ్‌ బస్​ టెర్మినల్‌..! పీఎన్‌బీఎస్‌పై తగ్గనున్న ఒత్తిడి!

 

ఢిల్లీ పర్యటనకు చంద్రబాబు.. నెల రోజుల్లో రెండోసారి! ఈసారి ఎందుకు వెళుతున్నారంటే?

 

ఖరీఫ్ సాగు లక్ష్యంగా మంత్రి అచ్చెన్న కీలక మార్గదర్శనం! రైతు సంక్షేమమే టార్గెట్!

 

టీటీడీలో కీలక నియామకాలు! ఏరి కోరి.. వారి మార్గదర్శకంలోనే ఇక!

 

ఏపీ రైతులకు శుభవార్త.. ఈ కార్డుతో ఎన్నో ప్రయోజనాలు! వెంటనే దరఖాస్తు చేయండి!

ఆంధ్ర  ప్రవాసి గ్రూప్ లో జాయిన్ అవ్వండి:

Whatsapp group

Telegram group

Facebook group



   #AndhraPravasi #NaraLokesh #AndhraPradesh #Appolitics #Jagan #APNews #LokeshMeeting